లేతమొక్కజొన్న పొత్తులు-8,
మైదాపిండి-ఒక టీస్పూన్,
బియ్యప్పిండి-ఒక టీస్పూన్,
సశనగపిండి-ఒక టీస్పూన్,
పసుపు-కొద్దిగా,
అల్లం, వెల్లుల్లి పేస్ట్-ఒకటిన్నర టీస్పూన్లు
ఉల్లిపాయ-ఒకటి,
ఉప్పు-తగినంత,
మిర్చిపొడి-అరటీస్పూన్
నూనె-వేయించటానికి సరిపడినంత
ధనియాలపొడి-అర టీస్పూన్,
జీలకర్రపొడి-అర టీస్పూన్,
నిమ్మరసం-కొద్దిగా
తయారుచేసే విధానం
ముందుగా మొక్కజొన్న పొత్తులను నిలువుగా నాలుగు ముక్కలుగా చీల్చుకుని ఉంచుకోవాలి. మైదా, వరిపిండి, శనగపిండి, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిర్చిపొడులకు నీళ్లు కలిపి ఒక్కటి చేయాలి. ఈ మిశ్రమాన్ని మొక్కజొన్న ముక్కలకు బాగా పట్టించి తక్కువ నూనెలో దోరగా వేగనివ్వాలి. తర్వాత వాటిని బయటకు తీసి వాటిపై జీలకర్ర, ధనియాలు పొడి అద్దాలి. తిరిగి వాటిపై నిమ్మరసం పిండాలి. ఆనియన్, కాప్సికమ్, టమాటా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.