పనీర్ - 100 గ్రా.(ముక్కలుగా కట్ చేయాలి)
క్యాప్సికం ముక్కలు - పావుకప్పు
ఉల్లితరుగు - పావుకప్పు
ఉల్లిముక్కలు - అరకప్పు (పెద్దవిగా తరగాలి)
టొమాటో తరుగు - అరకప్పు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - కట్ట
పచ్చిమిర్చి - 5
మిరియాల పొడి - అరటీస్పూన్
గరం మసాలా - అరటీస్పూన్
ఉప్పు - తగినంత
నల్ల ఉప్పు - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్
షాజీరా - పావుటీస్పూన్
డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం :
పల్లీలు - 10 గ్రా.
జీడిపప్పు - 4 లేదా 5 పలుకులు
కర్బూజా గింజలు - 10 గ్రా.
బాదం పప్పు - 10 గ్రా.
నూనె - 5 గ్రా.
తయారుచేసే పద్ధతి :
- ముందుగా బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి డ్రై ఫ్రూట్స్ గ్రేవీ కోసం తీసుకున్న పదార్థాలన్నింటిని వేయించి, చల్లారాక కొద్దిగా నీరు కలిపి పేస్ట్ లా చేసుకోవాలి.
- అదే బాణలిలో నూనె పోసి కాగాక, షాజీరా, ఎండు మిర్చి, ఉల్లితరుగు వేసి దోరగా వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.
- టొమాటో తరుగు, మిగిలిన పదార్థాలన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించాలి. నూనె పైకి తేలుతున్నపుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసి కలపాలి.
- బాగా వేగిన తర్వాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్స్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించాలి.
- కడాయిలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
మూలం : సాక్షి దినపత్రిక