బెండకాయలు-పది,
శనగపిండి-నాలుగు టేబుల్‌స్పూన్లు
నూనె-రెండు టేబుల్‌స్పూన్లు,
ఉల్లిపాయ-ఒకటి
జీలకర్ర-ఒక టేబుల్‌స్పూన్
ఉప్పు-రుచికి సరిపడా
ధనియాలపొడి-ఒకటిన్నర టేబుల్‌స్పూన్లు
పసుపు-ఒక టేబుల్ స్పూన్,
కారం-ఒక టేబుల్ స్పూన్
ఆమ్‌చూర్‌పొడి-అర టేబుల్‌స్పూన్
ఉల్లిగింజలు-అర టేబుల్ స్పూన్
తయారుచేసే విధానం:
ఉల్లిపాయల్ని సన్నని ముక్కలుగా కోయాలి. బెండ కాయల్ని పలుచని ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనెవేసి కాగాక జీలకర్ర, ఉల్లిముక్కలు వేసి వేయిం చాలి. వేగాక బెండకాయముక్కలు, ఉప్పు,ధనియాలపొడి, పసుపు, కారం వేసి మూతపెట్టి ఐదునిమిషాలు మగ్గనివ్వాలి. శనగపిండి వేసి కలిపి మూతపెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆమ్‌చూర్ పొడి, ఉల్లి గింజలు వేసి కలిపి ముక్కలు ఉడికేవరకూ ఉంచాలి. మధ్య మధ్యలో తిప్పుతూ పూర్తిగా ఉడికాక దించాలి.