బేబీకార్న్-8కండెలు,
నూనె-పావుకప్పు
ఉల్లిపాయలు-రెండు,
టమాటాలు-మూడు
పెరుగు-ఒక కప్పు,
ఉప్పు, కారం-తగినంత
చక్కెర-చిటికెడు,
పసుపు-అరచెంచా,
పచ్చిమిర్చి-మూడు
మొక్కజొన్న పిండి-రెండు చెంచాలు,
కొత్తిమీర-రెండు రెమ్మలు
తయారుచేసే విధానం
బేబీకార్న్ కండెల్ని పొడవుగా చీల్చాలి. రెండు కూతలు వచ్చే వరకు కుక్కర్‌లో ఉడికించాలి.
తరువాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు బాణలిలో నూనెపోసి పొయ్యిమీద పెట్టాలి. వేడెక్కాక దానిలో ఉల్లి,పచ్చిమిర్చి. టమాటా తరుగు వేసి మగ్గించాలి.
తర్వాత ఉడికించిన కార్న్ ముక్కలు పసుపు, కారం, ఉప్పు, చక్కెర వేసి మూతపెట్టాలి. 5నిమిషాల తరువాత దానిలో కప్పునీరు, పావుకప్పు పెరుగు వేయాలి. ఈలోగా మొక్కజొన్న పిండికి రెండు చెంచాల నీళ్లు కలపాలి. దానిని కూడా బాణలిలో వేయాలి. కొద్దిసేపు ఉడికేటప్పటికి గ్రేవీ తయా రవుతుంది. దించే ముందు కొత్తిమీర ముక్కలు చేసి జల్లాలి. ఇక మొక్కజొన్న కుర్మా సిద్ధమైనట్లే.