పన్నీర్ - 100 గ్రా.
గరం మసాలా - టీస్పూన్
జీడిపప్పు - 20 గ్రా.(పొడి చేయాలి)
ఉల్లితరుగు - పావుకప్పు
టొమాటో తరుగు - పావుకప్పు
తర్బూజ గింజల పేస్ట్ - 20 గ్రా.
అజినమెటో - అరటీస్పూన్
బటర్ - 10 గ్రా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా.
పసుపు - కొద్దిగా
నూనె - తగినంత
ఉప్పు - తగినంత
కారం - 2 టీస్పూన్లు
ఉల్లిపాయలు - 2 (పొరలుగా తీయాలి)
తయారుచేసే పద్ధతి :
- పన్నీర్ ను కట్ చేసుకోవాలి
- స్టవ్ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత పన్నీర్ ముక్కలను వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లితరుగు, కరివేపాకు జతచేసి వేయించాలి. టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి, 5 నిముషాలు ఉడికించాలి.
- గరం మసాలా, అజినమెటో, తగినంత ఉప్పు వేసి కలపాలి. జీడిపప్పు పొడి, తర్బూజ గింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి, కొద్దిగా ఉడుకుతుండగా పసుపు, కారం వేసి కలపాలి.
- ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి.
మూలం : సాక్షి దినపత్రిక