బంగాళాదుంపలు - రెండు
బీన్స్ - 12
బఠానీ - అరకప్పు
కాలీఫ్లవర్ - పువ్వులో పావు వంతు
క్యారెట్లు - రెండు
గుమ్మడి కాయ - చిన్న ముక్క
కొబ్బరి తురుము - ముప్పావు కప్పు
చిక్కని కొబ్బరి పాలు - అరకప్పు
పలుచని కొబ్బరి పాలు - అరకప్పు
చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు
నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఎండు మిర్చి - 4
జీలకర్ర - టీస్పూన్
ధనియాలు - టేబుల్ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 10
పసుపు - టీస్పూన్
ఆవాలు - టీస్పూన్
మినపప్పు - టీస్పూన్
కరివేపాకు - 2 రెమ్మలు
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- బంగాళాదుంపలు, బీన్స్, గుమ్మడి, క్యారెట్లను ముక్కలుగా కోయాలి. క్యాలిఫ్లవర్ ను చిన్న రెమ్మలుగా తుంచాలి.
- బాణలిలో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, మిగిలిన కొబ్బరి తురుము వేసి మంచి వాసనా వచ్చే వరకు వేయించి దించి మెత్తగా రుబ్బాలి.
- మందపాటి బాణలిలో పలుచని కొబ్బరి పాలు పోసి అందులో కూరగాయ ముక్కలు వేసి ఉడికించాలి. కొద్ది సేపటి తర్వాత పసుపు, ఉప్పు కూడా వేయాలి.
- తరువాత చింతపండు గుజ్జు వేసి ముప్పావు వంతు ముక్కలు ఉడికే వరకు ఉంచాలి. తర్వాత మసాలా పొడి వేసి మరో పది నిముషాలు ఉడికించాలి.
- మరో పొయ్యి మీద చిన్న బాణలి పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు చేసి కూరలో వేయాలి. చివరగా చిక్కని కొబ్బరి పాలు పోసి సిమ్ లో ముక్కలు పూర్తిగా ఉడికే వరకు ఉంచి దించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం