
క్యారెట్లు - 4
ఉల్లిపాయ - 1
ఉల్లికాడల కట్ట - 1
ఉప్పు - తగినంత
మైదా - అరకప్పు
కోడిగుడ్లు - రెండు
నూనె - వేయించడానికి సరిపడా
మిరియాల పొడి - పావు చెంచ
తయారుచేసే పద్ధతి :
- క్యారెట్లను పొడుగ్గా, ముక్కల్లా తరగాలి.
- ఉల్లిపాయల్ని సన్నగా తరిగి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి నీళ్ళు పోసి, పిండిలా కొద్దిగా పలుచగా కలుపుకోవాలి.
- ఇందులో క్యారెట్ ముక్కల్ని ముంచి కాగుతున్న నూనెలో వేయించాలి. ఎర్రగా అయ్యాక తీసేసి వేడివేడిగా టమాటో సాస్ తో గాని, అన్నంలోకి సైడ్ డిష్ గా గాని తింటే చాలా రుచిగా ఉంటాయి.
మూలం : ఈనాడు వసుంధర