పనీర్ : 250 గ్రా.
చిల్లీ గార్లిక్ సాస్ : కొద్దిగా
క్యాప్సికం తరుగు : అరకప్పు
రెడ్ క్యాప్సికం తరుగు : అరకప్పు
ఉల్లి తరుగు : కప్పు
సోయాసాస్ : కొద్దిగా
అజినమెటో (చైనా సాల్ట్) : కొద్దిగా
ఉల్లికాడల తరుగు : కొద్దిగా
తయారి విధానం :
ముందుగా పనీర్ ను పెద్దపెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.తర్వాత ఒక బాణలి లి నెయ్యి లేదా నూనె వేసి స్టవ్ మీద ఉంచి కాగాక పనీర్ ముక్కలు వేసి లేత గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి. ఇప్పుడు సోయాసాస్, అజినమెటో, చిల్లీ గార్లిక్ సాస్, ఉప్పు వేసి కలపుకోవాలి. చివరగా పనీర్ వేసి కలుపుకోవాలి. ఒక టూత్ పిక్ కి పనీర్, ఉల్లికాడలు, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు గుచ్చి సర్వ్చేస్తే చాలా బాగుంటుంది.
మూలం : సాక్షి