కాప్సికం ముక్కలు- 2 కప్పులు
బంగాళా దుంపల ముక్కలు - 1 కప్పు
ఉల్లిపాయలు- 2
పచ్చిమిర్చి- 2
కొబ్బరి పొడి- 3 టి.స్పూన్
ధనియాలు - 1 టి.స్పూన్
జీడిపప్పు- 5
గసగసాలు- 1 టి.స్పూన్
గరం మసాలా పొడి- 1/4 టి.స్పూన్
పెరుగు- 1/2 కప్పు
టమాటాలు - 2
పసుపు - 1/4 టి.స్పూన్
కారం పొడి - 1 టి.స్పూన్
అల్లం, వెల్లుల్లి ముద్ద- 1 టి.స్పూన్
ఉప్పు- తగినంత
నూనె - 3 టి.స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
- కాప్సికం, బంగాళాదుంపల్ని ఒకే సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- పెనం వేడిచేసి ధనియాలు, గసగసాలు దోరగా వేయించుకోవాలి.
- కొబ్బరి పొడి, వేయించిన ధనియాలు, గసగసాలు, జీడిపప్పు, టమాటాముక్కలు, పెరుగు కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- పాన్లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా బంగార రంగు వచ్చేవరకు వేయించుకుని పసుపు, అల్లం,వెల్లుల్లి ముద్దవేసి మరి కొద్దిగా వేయించాలి. ఇందులో బంగాళా దుంపల ముక్కలు, కాప్సికం ముక్కలు, కారం పొడి, ఉప్పువేసి కలిపి మూతపెట్టి మగ్గనివ్వాలి.
- ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత తయారుచేసుకున్న మసాలాముద్దను, కప్పుడు నీళ్లుపోసి కలిపి మూతపెట్టి ఉడికించాలి. కూర ఉడికి నూనె తేలుతున్నప్పుడు గరంమసాలా పొడి వేసి కలిపి దింపేయాలి.
- ఈ కూర పులావ్, రోటీ, నాన్, పరాఠాలకు బావుంటుంది.