బ్రెడ్ స్లయిస్‌లు - నాలుగు,
శెనగపిండి - ఒక కప్పు,
జీలకర్ర - ఒక టీ స్పూన్,
కారం - అర టీస్పూన్,
నూనె - వేగించడానికి సరిపడా,
ఉప్పు - రుచికి సరిపడా,
వంటసోడా - చిటికెడు.
తయారుచేసే పద్ధతి :
- ఒక గిన్నెలో శెనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం, వంటసోడా వేసుకుని నీళ్లు, రెండు స్పూన్ల వేడి నూనె వేసి ఉండలు కట్టకుండా మెత్తటి పేస్ట్‌లా కలపాలి.
- తరువాత కళాయిలో నూనె పోసి వేడిచేయాలి. అది వేడెక్కేలోగా ఒక్కో బ్రెడ్‌ను నాలుగు ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్ని శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. ఈ వేడి వేడి బ్రెడ్ బజ్జీలను సాస్ లేదా చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక