బంగాళాదుంపలు - అర కిలో
నూనె - వేయించడానికి సరిపడా
సెనగ పిండి - అరకిలో
బియ్యప్పిండి - కప్పు
కొత్తిమీర - కొద్దిగా
పూదీన తురుము - కొద్దిగా
కరివేపాకు తురుము - కొద్దిగా
అల్లం వెల్లుల్లి - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - అర టీస్పూన్
పచ్చిమిర్చి - 2 టీస్పూన్లు
ఆవాలు - ఒక టీస్పూన్
కేసరి ఫుడ్ కలర్ - పావుటీస్పూన్
వంట సోడా - పావుటీస్పూన్
నిమ్మరసం - అర టీస్పూన్
తయారుచేసే పద్ధతి:
- బంగాళాదుంపలు ఉడికించి ఆరనివ్వాలి. తరువాత తోకకు తీసి బాగా చిదమాలి.
- బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు తురుము వేసి దోరగా వేగనివ్వాలి. అందులో పసుపు, అల్లం, పచ్చిమిర్చి గుజ్జు వేసి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి. ఇప్పుడు చిదిమిన బంగాళాదుంపలు వేసి ఉప్పు చల్లి కలుపుతూ పొడిపొడిగా వేగనివ్వాలి. అనంతరం కొత్తిమీర, పూదీన వేసి బాణలిను కిందకు దించి నిమ్మరసం కలపాలి.
- ఒక లోతైన గిన్నెలో సెనగపిండి, బియ్యప్పిండి, కేసరి రంగు, వంట సోడా, తగినంత ఉప్పు వేసి నీరు పోసి, గట్టి పెరుగులా పిండిని కలిపి ఉంచాలి.
- ఆలుగడ్డల మిశ్రమాన్ని లడ్డులంత సైజ్ లో ముద్దలుగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ముద్దలుగా చేసిన ఆలుగడ్డల మిశ్రమాన్ని పిండిలో ముంచి నూనె లో వేసి ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. అంతే ఆలూ బోండాలు రెడీ. ఇవి పచ్చిమిర్చి పచ్చడి, టమాటో సాస్ తో వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటాయి.
మూలం : సాక్షి దినపత్రిక