మీల్‌మేకర్ - పావు కేజీ,
శనగపప్పు - సగం కప్పు,
ఉడికించిన కోడిగుడ్లు - నాలుగు,
అల్లం పేస్ట్ - 1
పూదీనఆకులు - గుప్పెడు,
దాల్చిన చెక్క - కొద్దిగా,
లవంగాలు - నాలుగు,
యాలకులు - 2,
జీలకర్ర - 1/2 స్పూన్,
సోంపు - 1/2 స్పూన్,
కారం - రెండు
నల్లమిరియాల పొడి - ఒక స్పూన్
గరం మసాలా - ఒక స్పూన్
పసుపు - 1/2 స్పూన్,
ఒక గుడ్డు అదనంగా,
ఉప్పు - తగినంత,
నూనె- డీప్ ఫ్రైకి సరిపడ
తయారు చేసేవిధానం :
- ఒక పాన్‌లో మూడునాలుగు కప్పుల నీళ్లు పోసి, ఇందులో దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు వేసి బాగా ఉండికించాలి. కొద్దిసేపాగి మీల్‌మేకర్ వేసి ఎక్కువ మంటమీద 2 నుంచి మూడు నిమిషాలపాటు ఉడికించాలి. దింపేసి మూతపెట్టి 10 నుంచి 15 నిమిషాలపాటు పక్కన పెట్టి చూస్తే మీల్‌మేకర్ సైజు డబుల్ అవుతుంది.
- ఇప్పుడు అందులోని నీటిని వంపి మీల్‌మేకర్ చేతిలోకి తీసుకుని నీళ్లు పోయేలా పిండి పక్కన పెట్టుకోవాలి.
- మరో గిన్నె తీసుకుని అందులో శనగపప్పు మృదువుగా అయ్యేంతవరకు ఉడికించాలి. తరువాత నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు పక్కకు పెట్టిన మీల్‌మేకర్‌లో ఉడికించిన శనగపప్పు, పూదీన ఆకులు, అల్లం పేస్ట్, సోంపు, జీలకర్ర, పసుపు, కారం, నల్లమిరియాల పొడి, గరంమసాలా పొడి, ఉప్పు వేసి మెత్తగా అయ్యేంతవరకు మిక్సీ పట్టాలి. నీళ్లు అస్సలు పోయకూడదు.
- అదనంగా తీసుకున్న కోడిగడ్డును పగులకొట్టి సొన వేసి మళ్లీ మిక్సీ పట్టాలి.
- ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉడికించిన కోడిగుడ్డు చుట్టూ ఫొటోలో చూపినవిధంగా పెట్టాలి.
- తరువాత ఒకటినుంచి రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో పెట్టి తీశాక, ఒక గిన్నెలో నూనె పోసి బాగా వేడిచేయాలి.
- మిశ్రమం దట్టించిన ఒక్కో కోడిగుడ్డును తీసుకుని నూనెలో వేయించాలి. నిమ్మ ముక్కలతో ఈ కబాబ్స్ సర్వ్ చేస్తే సూపర్!