
శెనగపిండి - తగినంత,
ఉప్పు -రుచికి సరిపడా,
బేకింగ్ సోడా - చిటికెడు,
పచ్చిమిర్చి - పది,
స్టఫ్పింగ్ కోసం
ఉల్లిపాయలు - సరిపడా,
వాము - కొద్దిగా,
నీళ్లు, నూనె - సరిపడా.
తయారుచేసే పద్ధతి :
- శెనగపిండిలో నీళ్లు పోసి చిక్కటి పేస్ట్‌లా చేయాలి. ఇందులో బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి.
- తరువాత మిరపకాయల్ని నిలువుగా చీల్చి (రెండు ముక్కలు కాకూడదు) గింజలు తీసేయాలి. వీటిని ఉప్పు వేసిన నీళ్లలో అరగంటపాటు నానపెట్టాలి. ఆ తరువాత మిర్చిని ఆ నీళ్లలోనుంచి బయటకు తీసి టిష్యూ పేపర్ మీద ఉంచి నీటిని వత్తేయాలి.
- ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోసి వాటిని పచ్చిమిర్చిలో కూరి శెనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేగించాలి.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక