పన్నీర్ ముక్కలు - 12
నూనె - టేబుల్ స్పూన్
చాట్ మసాలా - టీస్పూన్
కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్
పన్నీర్ కు పట్టించేందుకు
నిమ్మరసం - అరటీస్పూన్
కారం - అరటీస్పూన్
జీలకర్ర పొడి - అరటీస్పూన్
పెరుగు - ముప్పావు కప్పు
అల్లం ముద్ద - అరటీస్పూన్
పచ్చిమిర్చి ముద్ద - అరటీస్పూన్
మిరియాల పొడి - టీస్పూన్
వాము - అరటీస్పూన్
సోంపు - టీస్పూన్
పసుపు - పావు టీస్పూన్
సెనగపిండి - ముప్పావు కప్పు
నూనె - టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కుంకుమ పువ్వు - కొద్దిగా (టేబుల్ స్పూన్ పాలల్లో నానబెట్టాలి)
తయారుచేసే పద్ధతి :
- పన్నీర్ కి పట్టించే పదార్థాలన్నింటిని ఓ గిన్నెలో వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముక్కలకు పట్టించి అరగంట సేపు పక్కన ఉంచాలి.
- నాన్ స్టిక్ పాన్ తీసుకొని మూడు లేక నాలుగు పన్నీర్ ముక్కలు చొప్పున వేసి నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి. ఇలాగే అన్ని కాల్చాలి. వీటి మీద చాట్ మసాలా, కొత్తిమీర తురుము చల్లి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం