బియ్యం పిండి - 3 కప్పులు
పుట్నాల పప్పు పొడి - 1 కప్పు
వాము - 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
పానీపురి మసాలా పొడి:
పుదీనా, కొత్తిమీర - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 3
ఆంచూర్ పొడి - 1 టీస్పూ.
జీలకర్ర పొడి - 1/2 టీ.స్పూ.
చాట్ మసాలా పొడి - 1/2 టీ.స్పూ.
నల్ల ఉప్పు - 1/4 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి
ఇలా చేయాలి
- పానీపురి మసాలా కోసం సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర, పచ్చి మిర్చి, నల్ల ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, ఆంచూర్ పొడి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఒక గినెనలో బియ్యం పిండి, పుట్నాల పప్పు పొడి, ఉప్పు, వాము వేసి కలపాలి.
- ఇందులో పానీపురి మసాలా ముద్ద వేసి కలపాలి.
- మరో గినె్నలో రెండు కప్పుల నీళ్లు మరిగించి రెండు చెంచాల నూనె వేయాలి. ఈ నీళ్లను పిండిలో వేసి కలిపి మూత పెట్టి ఉంచాలి.
- చల్లారిన తర్వాత బాగా పిసికి పెట్టుకోవాలి.
- మురుకుల గిద్దెలో కొంచెం కొంచెం పిండి ముద్ద పెట్టుకుని వేడి నూనెలో మురుకులు/జంతికల్లా వత్తుకుని నిదానంగా కాల్చుకోవాలి.