
ఎండు బఠానీలు - 2 కప్పులు
బేకింగ్ సోడా - అరటీస్పూన్
ఇంగువ - చిటికెడు
చింతపండు చట్నీ - కొద్దిగా
గ్రీన్ చట్నీ - కొద్దిగా
బంగాళాదుంపలు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
టొమాటో - ఒకటి
కీరా - ఒకటి
నిమ్మరసం - కొద్దిగా
ఉప్పు - రుచికి సరిపడా
కారం - టీస్పూన్
గరం మసాలా - టీస్పూన్
బ్లాక్ సాల్ట్ - టీస్పూన్
జీలకర్ర పొడి - అరటీస్పూన్
తయారుచేసే పద్ధతి:
- ఓ గిన్నెలో బఠానీలు వేసి మునిగే వరకు నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టాలి.
- ఉదయాన్నే బఠానీలను ఫ్రెషర్ కుక్కర్ లో వేసి సోడా, ఉప్పు, ఇంగువ వేసి ఉడికించాలి. తరువాత నీళ్ళు వంపేసి బఠానీలను ఓ గిన్నెలో వేయాలి.
- బంగాళాదుంపలను ఉడికించి, పొట్టు తీసి చిన్న ముక్కలుగా కోయాలి.
- ఉల్లిపాయ, టొమాటో, కీరా దోస అన్నింటిని చిన్న ముక్కలుగా కోయాలి. వీటికి బంగాళాదుంపలు కూడా చేర్చి కలపాలి.
- ఇప్పుడు ఓ ప్లేటులో రెండు టేబుల్ స్పూన్ల బఠానీలు వేసి వాటి మీద కొద్దిగా ఉల్లిముక్కల మిశ్రమం వేసి గరం మసాలా, బ్లాక్ సాల్ట్, జీలకర్ర పొడి చల్లాలి. వీటిమీద కొద్దిగా చింతపండు చట్నీ, గ్రీన్ చట్నీలు వేసి నిమ్మరసం పిండి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం