మినపప్పు - ముప్పావు కప్పు
గోధుమ పిండి - 4 కప్పులు
పచ్చిమిర్చి - ఒకటి
ఉప్పు - అరటీస్పూన్
సోంపు - టేబుల్ స్పూన్
ధనియాలు - టీస్పూన్
కారం - అరటీస్పూన్
ఇంగువ - పావుటీస్పూన్
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి:
- మినపప్పును రాత్రే నానబెట్టుకోవాలి.
- గోధుమపిండిలో తగినన్ని నీళ్ళు పోసి చపాతీ పిండిలా కలుపుకొని తడి బట్ట వేసి అరగంట సేపు నాననివ్వాలి.
- ఇప్పుడు మినపప్పులో ఉప్పు, కారం, ధనియాలు, సోంపు వేసి మెత్తగా రుబ్బాలి.
- గోధుమపిండిని నిమ్మకాయంత ముద్ద తీసుకొని చిన్న పూరీలా వత్తుకొని అందులో కాస్త పప్పు మిశ్రమాన్ని పెట్టి మూసేసి కచోరీలా వత్తాలి.
- ఇలాగే అన్నీ చేసుకొని కాగిన నూనెలో వేయించి తీసి చట్నీతో వడ్డించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం