నూనె - రెండు టేబుల్ స్పూన్లు;
ఉల్లితరుగు - పావుకప్పు
వెల్లుల్లి తరుగు - టీ స్పూను;
ఎండుమిర్చి - 3;
పచ్చిమిర్చి తరుగు - 2 టీ స్పూన్లు
బంగాళదుంప - 1 (పెద్దది, ఉడికించి, తొక్క తీసి, చిన్నచిన్నముక్కలుగా చేయాలి)
ఉడికించిన బఠాణీ - 50 గ్రా.;
ధనియాల పొడి - 2 టీ స్పూన్లు
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు;
వైట్ బ్రెడ్ - 8 (పెద్ద స్లైసులు, చివర్లు తీసేయాలి)
డీప్ ఫ్రైకోసం నూనె - తగినంత
తయారుచేసే పద్ధతి:
- స్టౌ మీద పాన్ ఉంచి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి కాగాక, ఉల్లితరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు వేసి రెండు నిముషాలు వేయించాలి.
- బంగాళదుంప ముక్కలు, బఠాణీ, ధనియాలపొడి వేసి బాగా మెత్తగా అయ్యేలా కలిపి, రెండు నిముషాలు ఉడికించాలి.
- కిందకు దించి ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తురుము వేసి కలపాలి.
- బ్రెడ్ స్లైసులు ఫ్లాట్‌గా అయ్యేలా అప్పడాల కర్రతో నెమ్మదిగా ఒత్తాలి.
- ఉడికించుకున్న మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, బ్రెడ్ పీస్ మీద ఉంచి పైన మరో పీస్ ఉంచి, అంచులను నీటితో తడుపుతూ అంతా మూసుకునేలా సమోసా ఆకారంలో జాగ్రత్తగా మూయాలి.
- స్టౌ మీద పాన్ ఉంచి నూనె పోసి కాగాక, తయారుచేసి ఉంచుకున్న సమోసాలను వేసి వేయించాలి
- బంగారురంగులోకి వచ్చాక తీసి, పేపర్ టవల్ మీద ఉంచాలి.
మూలం : సాక్షి దినపత్రిక