ఉడికించిన గుడ్లు - ఐదు,
ఉల్లిపాయ - ఒకటి (సన్నగా తరిగి),
టొమాటో - ఒకటి (సన్నగా తరిగి),
మొలకెత్తిన గింజలు - పావు కప్పు,
బంగాళాదుంప - ఒకటి,
కొత్తిమీర తరుగు - రెండు టేబుల్ స్పూన్లు,
గ్రీన్ చట్నీ - ఒక టీస్పూన్,
చింతపండు చట్నీ - ఒకటిన్నరటేబుల్ స్పూన్,
పచ్చిమిర్చి- మూడు (సన్నగా తరిగి),
కారం - అర టీస్పూన్,
ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ:
- గుడ్లను చిన్న ముక్కలుగా కోయాలి.
- బంగాళాదుంపని ఉడికించి పొట్టు తీసి పొడిపొడిగా నలపాలి.
- కొత్తిమీర మినహాయించి మిగతా పదార్థాలన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
- దీనిపైన కొత్తిమీరను అలంకరించి తినేయాలి.