పన్నీర్ - అరకేజీ,
కారం - ఒకటిన్నర టీ స్పూన్స్,
ధనియాలపొడి - ఒక టీ స్పూన్,
శనగపిండి - 2 స్పూన్స్,
ఆమ్‌చూర్ - అర టీ స్పూన్,
గరం మసాలా - అర టీ స్పూన్,
పచ్చిమిరపకాయలు - 3,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
పన్నీర్‌ను చతురవూసాకారంలో చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలను కట్ చేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి వేసి అందులో ఉప్పు, కారం, ఆమ్‌చూర్, ధనియాలపొడి, గరం మసాలా, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకోవాలి. తర్వాత కొన్ని నీళ్ళు పోస్తూ ఉండలు కట్టకుండా కలపాలి. పిండి మరీ జారుగాకాకుండా చూసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక.. పన్నీర్ ముక్కలను శనగపిండి మిశ్రమంలో ముంచి వేయాలి. బంగారు వర్ణం వచ్చేవరకు కాల్చుకోవాలి. నోరూరించే పన్నీర్ పకోడి తినడానికి సిద్ధంగా ఉంటుంది.