మినపపప్పు - అర కప్పు,
శనగపప్పు - అర కప్పు,
బియ్యం - అర కప్పు,
బఠాణీలు - ఒక కప్పు,
అల్లం - చిన్న ముక్క,
పచ్చిమిరపకాయలు - 3,
ఇంగువ - అర టీ స్పూన్,
బేకింగ్ సోడా - పావు టీ స్పూన్,
ఆవాలు - అర టీ స్పూన్,
కొబ్బరితురుము - ఒక స్పూన్,
నువ్వులు - 2 టీ స్పూన్స్,
నూనె, ఉప్పు - తగినంత
తయారు చేసే విధానం :
బియ్యం, శనగపప్పు, మినపప్పులను కడిగి విడివిడిగా నానబెట్టాలి. తర్వాత రోజు పొద్దున్నే అన్నింట్లో నీటిని వడగట్టి ఒక గిన్నెలో వేసుకోవాలి. అందులో వాటితోపాటు అల్లం, పచ్చిమిరపకాయలు, ఇంగువ, బఠాణీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న మిశ్రమాన్ని మూతపెట్టి 7 నుంచి 8గంటల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత దీంట్లో బేకింగ్ సోడా, ఉప్పు, కొన్ని నీళ్ళు పోసి ఇడ్లీ మిశ్రమంలా కలుపుకోవాలి. ధోక్లా ప్లేట్‌లో ఈ మిశ్రమాన్ని వేసి కుక్కర్‌లో ఆవిరి మీద ఉడికించాలి. పదిహేను నిమిషాల్లో ఉడికిపోతాయి. వాటిని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. దాన్ని చిన్నగా మనకు నచ్చిన రీతిలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, నువ్వులు, పచ్చిమిరపకాయలు వేయించి ధోక్లాల మీద వేయాలి. కొబ్బరితురుముతో అందంగా గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.