telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

మొక్కజొన్న కట్లెట్

8/31/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు
మొక్కజొన్న గింజలు : 2 కప్పులు,

ఉల్లిచక్రాలు : 10,
కొబ్బరి కోరు : కప్పు,
పచ్చిమిర్చి : 5,
కార్న్ఫ్లోర్ : అరకప్పు,
నూనె : అరకప్పు,
కొత్తిమీర : అరకప్పు,
అల్లంవెల్లులి పేస్టు : టేబుల్ స్పూన్,
బ్రెడ్పొడి : 2 కప్పులు,
శనగపిండి : కప్పు.

తయారుచేసే పద్ధతి :
మొక్కజొన్న గింజలు, కొబ్బరి కోరు, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం ఇందులో శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లంవెల్లులి పేస్టు వేసి బాగా కలపాలి. మీకు నచ్చిన ఆకారంలో వీటిని తయారు చేసుకోని బ్రెడ్ పౌడర్లో అద్దుకుని పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించి పెనం మీద కొద్దిగా నూనె వేసి కట్లెట్ను వేసి రెండు పక్కల ఎర్రగా కాల్చాలి. అనంతరం వీటిని ఉల్లిచక్రాలతో అలంకరించండి.. అంతే మొక్క జొన్న కట్లెట్ తయార్..


0 Comments

క్యాబేజీ బోండా

8/29/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
క్యాబేజీ తరుగు-రెండు కప్పులు,

బంగాళాదుంప-ఒకటి
పెసరపప్పు-అరకప్పు,

మిర్చి-నాలుగు
ఉప్పు-తగినంత,

పసుపు-చిటికెడు
కొబ్బరితురుము-రెండు చెంచాలు
గరంమసాలా-చెంచా,

కరివేపాకు-నాలుగు రెబ్బలు
శనగపిండి-రెండు కప్పులు,

వంటసోడా-చిటికెడు
వాము-అరచెంచా,

నూనె-వేయించడానికి సరిపడినంత


తయారుచేసే విధానం
  • బంగాళాదుంపను కుక్కర్లో రెండు కూతలు వచ్చే వరకూ ఉడికించాలి. చల్లారాక పొట్టుతీసి చేత్తో మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పును నానబెట్టి ఉంచాలి. తరువాత బాణలిలో నాలుగు చెంచాల నూనె వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, కొబ్బరి తురుము, ఉప్పు, పసుపు వేయాలి. కొద్దిసేపటికి క్యాబేజీ తరుగు, పెసర పప్పు వేసి కలియతిప్పాలి. అందులో కాసిన్ని నీళ్లు పోసి మూతపెట్టాలి.
  • ఐదు నిమిషాలయ్యాక బంగాళాదుంప మిశ్రమం, కొత్తిమీర, గరంమసాలా వేసి పక్కన దించేయాలి. చల్లారాక ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఓ గిన్నెలో శనగపిండి తీసుకుని అందులో వంటసోడా, ఉప్పు, వాము చేర్చి బజ్జీలా పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె పోసి పొయ్యిమీద పెట్టాలి.
  • వేడయ్యాక ముందు సిద్ధం చేసి పెట్టుకున్న ఉండల్ని శనగపిండిలో ముంచి వేయాలి. బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించి తీస్తే క్యాబేజీ బోండా సిద్ధం. వీటిని టమాటసాస్తో తింటే బాగుంటాయి.

0 Comments

సాండ్ విచ్ డోక్లా

8/20/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
శనగపిండి - 1 కప్పు
పసుపు - చిటికెడు
ఈనో సాల్టు- 1 టీ.స్పూ.
నీళ్లు - 1/2 కప్పు


పోపు :
నూనె - 1 టీ.స్పూ.
ఆవాలు - 1/4 టీ.స్పూ.
కరివేపాకు - 2 రెబ్బలు
నీళ్లు - 2 టీ.స్పూ.
పంచదార - 1 టీ.స్పూ.
నిమ్మరసం - 1 టీ.స్పూ.
పుదీనా ఆకులు,
కొత్తిమీర ఆకులు - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 2

తయారుచేసే పద్ధతి :
  • పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  • డోక్లా చేయాలనుకునే పళ్లెం లేదా కేక్ టిన్నుకు లోపలి వైపు నూనె రాసుకోవాలి.
  • ఒక గి న్నెలో జల్లించిన శనగపిండి తీసుకుని పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
  • ఈనో ఫ్రూట్ సాల్ట్, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని నూనె రాసిన పళ్లెంలో ముప్పావు వంతు వరకు పోయాలి. కుక్కర్లో గ్లాసుడు నీళ్లుపోసి ఒక స్టాండ్ పెట్టి దానిమీద ఈ పళ్లెం పెట్టి మూత పెట్టాలి. కుక్కర్ మూత కూడా పెట్టి పైన విజిల్ పెట్టకుండా పదిహేను నిమిషాలు ఉడికించి దింపేయాలి. ఒక చిన్న గినె్నలో పంచదార, నీళ్లు, నిమ్మరసం వేసి కలిపి చల్లారిన డోక్లా మీద పోసి పది నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత తిరగేసి మెల్లిగా తడితే ఉడికిన డోక్లా మొత్తం బయటికి వచ్చేస్తుంది.
  • దాన్ని మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేరే పళ్లెంలో లేదా గినె్నలో పెట్టాలి. ఈ డోక్లాలను జాగ్రత్తగా అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసి మధ్యలో తయారుచేసుకున్న గ్రీన్ చట్నీ రాసి దానిపైన మిగతా ముక్క పెట్టాలి. ఇప్పుడది సాండ్విచ్లా ఉంటుంది.
  • ఒక చిన్న గినె్న లేదా గరిటలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక తీసి డోక్లాలమీద వేయాలి. వీటిని వెంటనే సర్వ్ చేయొచ్చు లేదా కాస్త చల్లబరచి తిన్నా బావుంటాయి. ఇష్టముంటే పైన పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు.

0 Comments

దొండకాయ బజ్జీ

8/20/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు : 
దొండకాయలు - పావుకేజి, 
శెనగపిండి - ఒక కప్పు, 
బేకింగ్ సోడా - అర టీస్పూన్, 
కారం - ఒక టీస్పూన్, 
ఉప్పు- రుచికి సరిపడా



తయారుచేసే పద్ధతి: 
  • శెనగపిండి, బేకింగ్‌సోడా, కారం, ఉప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి, ఒక స్పూన్ నూనె కూడా వేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి. 
  • దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోయాలి. 
  • కళాయిలో నూనె పోసి వేడి చేసి దొండకాయ ముక్కల్ని శెనగపిండి పేస్ట్‌లో ముంచి వేగించాలి. ఎంతో సింపుల్‌గా దొండకాయ బజ్జీలు రెడీ.


మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 

0 Comments

బేబీకార్న్ పకోడి

8/17/2013

0 Comments

 
Picture

కావలసిన పదార్థాలు :
 మైదా - ఐదు టేబుల్ స్పూన్లు,
 బేబీకార్న్ - పది,
కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూన్,
మొక్కజొన్నపిండి - ఐదు టేబుల్ స్పూన్లు,
వెల్లుల్లి రెబ్బలు- ఆరు,
అల్లం - చిన్న ముక్క,
నూనె- వేగించడానికి సరిపడా,
ఉప్పు - రుచికి సరిపడా.

తయారుచేసే పద్ధతి :
 బేబీకార్న్ నిలువుగా రెండు భాగాలుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి, అల్లంలను మిక్సీ వేసుకోవాలి. అందులో మైదా, మొక్కజొన్నపిండి, ఉప్పు, మసాలా పేస్ట్, కొత్తిమీర తరుగు వేసి నీళ్లతో పకోడి పిండిలా కలపాలి. ఈ పిండిలో బేబీకార్న్ ముక్కల్ని ముంచి నూనెలో వే సి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. వేడివేడిగా తింటుంటే కరకరమంటూ బాగుంటాయి.

0 Comments

దోసకాయ బజ్జీ

8/17/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు : 
దోసకాయ ముక్కలు       - ఒక కప్పు, 
బంగాళాదుంప ముక్కలు - ఒక కప్పు, 
క్యాబేజీ తరుగు                - ఒక కప్పు, 
ఉల్లిపాయ                       - ఒకటి, 
పచ్చిమిర్చి                     - ఆరు, 
కొత్తిమీర తరుగు              -  ఒక కప్పు, 
తోటకూర కాడలు             - అరకప్పు, 
అల్లంవెల్లుల్లి పేస్ట్              - అర స్పూన్, 
మొక్కజొన్నపిండి           - ఒక కప్పు, 
గోధుమపిండి                  - ఒక కప్పు, 
ఉప్పు                            - రుచికి సరిపడా, 
నూనె               - వేగించడానికి సరిపడా, 
జీలకర్ర             - ఒక టీస్పూన్, 
నువ్వులు         - ఒక టీస్పూన్, 
కరివేపాకు రెబ్బలు - కొన్ని, 
బేకింగ్ సోడా        - చిటికెడు.

తయారుచేసే పద్ధతి: 
  • బంగాళాదుంప, క్యాబేజిలను కుక్కర్‌లో ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. 
  • ఒక గిన్నె తీసుకుని అందులో మొక్కజొన్న పిండి, గోధుమపిండి, ఉడికించిన బంగాళాదుంప, క్యాబేజి ముక్కలు, ఉల్లిపాయ, దోసకాయ ముక్కలు, తోటకూర కాడలు, కొత్తిమీర, అల్లంవెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, నువ్వులు, కరివేపాకులు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి రెండు స్పూన్ల నూనె, ఒక గ్లాసు నీళ్లు పోసి కలపాలి. అవసరమనుకుంటే మరికొన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు. 
  • కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. పిండిని చేతిలోకి తీసుకుని నచ్చిన ఆకారంలో చేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించి బయటకు తీయాలి. దోసకాయ బజ్జీ రెడీ. వేడివేడిగా చిల్లీ లేదా టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి.


మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 

0 Comments

గుత్తి వంకాయ బజ్జీ

8/10/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :
శెనగపిండి            - రెండు కప్పులు, 
బియ్యప్పిండి        - పావుకప్పు, 
వంటసోడా            - పావు టీస్పూన్, 
ఉల్లిపాయ             - ఒకటి, 
పచ్చిమిర్చి           - మూడు, 
కొత్తిమీర               -  కొద్దిగా  
అల్లం                   - చిన్న ముక్క, 
వెల్లుల్లి రెబ్బ         - ఒకటి, 
వంకాయలు         - మూడు, 
                                                            నూనె, ఉప్పు         -  సరిపడా.

తయారుచేసే పద్ధతి :
  • వంకాయల్ని నాలుగు భాగాలుగా కోయాలి( గుత్తి వంకాయ కూరకి కోసినట్టుగా). వాటిని నూనెలో వేసి సగం ఉడికించి పక్కన పెట్టాలి. 
  • ఆ తరువాత శెనగ, బియ్యప్పిండిలో నీళ్లు పోసి వంటసోడా, ఉప్పు వేసి చిక్కటి పేస్ట్‌లా కలపాలి. 
  • మిక్సీలో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి మెత్తటి పేస్ట్‌లా చేయాలి. 
  • ఆ తరువాత సగం ఉడికిన వంకాయల్లో మిక్సీ చేసిన మసాలా పేస్ట్ కూరాలి. వీటిని బజ్జీ పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి మిర్చి బజ్జీకి వేగించినట్టుగానే వేగించాలి. వీటిని నచ్చిన చట్నీతో తినొచ్చు లేదా అన్నంలో కూరగా అయినా తినొచ్చు.


మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక 

0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    రగ్ డా పట్టి
    ఎగ్ కట్ లెట్స్
    ఎగ్ చాట్
    ఎగ్ బజ్జీ
    ఆలూ టిక్కా
    ఎగ్ బాల్స్
    ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్
    ఎగ్ బుర్జీ సాండ్‌విచ్
    ఆలూ పన్నీర్ చాట్
    ఎగ్ మంచూరియా
    బేల్ పూరి
    పానీ పూరి
    లెహ్ సుని టిక్కి
    ఫిష్ పకోడి
    రైస్ పకోడి
    దాల్ కచోరి
    గోబీ పకోడీ
    చాకో బనానా సాండ్ విచ్
    మీల్ మేకర్ మంచూరియా
    రాగి పిండి బిస్కెట్స్‌
    కీమా టిక్కీ
    జాలీ మిర్చి
    గోబీ మంచురియా
    కబాబ్
    సమోసా రగడ
    బఠానీ చాట్
    మూంగ్ దాల్
    సాండ్ విచ్ డోక్లా
    పాలక్ పకోడి
    టమోటా బజ్జీ
    ఓట్స్ శాండ్ విచ్
    మొలకల ఫ్రూట్ భేల్
    పనీర్ పాలకూర బాల్స్
    బ్రెడ్ పాన్ కేక్
    గ్రీన్ పీస్ పూరీ
    గ్రీన్ పీస్ ధోక్లా
    బ్రెడ్ బజ్జీ
    పాలకూర పకోడీ
    యాపిల్ బజ్జీ
    బ్రెడ్ సమోసా
    సేమియా పకోడీ
    సొరకాయ పకోడి
    దోసకాయ బజ్జీ
    టొమాటో బోండా
    గుత్తి వంకాయ బజ్జీ
    అటుకుల టిక్కి
    పొటాటో బైట్స్
    తందూరీ టిక్కా
    స్వీట్ కార్న్
    బ్రెడ్ పిజ్జా
    కార్న్ టిక్కి
    సేమ్యా టిక్కి
    బ్రెడ్ స్వీట్ కార్న్ బాల్స్
    చిల్లీ పన్నీర్
    బ్రెడ్ పన్నీర్ రోల్
    బ్రెడ్ మంచురియా
    సకినాలు
    చెక్కలు
    కట్లెట్
    పన్నీర్ బజ్జీ
    పన్నీర్ పకోడీ
    దొండకాయ బజ్జీ
    పన్నీర్ పకోడి
    హరియాలి టిక్కి
    పన్నీర్ బాల్స్
    స్టఫ్డ్ మిర్చి బజ్జీ
    నర్గీసీ కబాబ్స్
    పన్నీర్ సిగార్స్
    ప్రాన్స్
    నూడుల్స్ ప్రై
    క్యాబేజీ బోండా
    పానీపూరీ మసాలా మురుకులు
    చాక్లెట్ ఫ్రైడ్ డిమ్సమ్...
    అమెరికన్ చాప్‌సూయి
    సర్వపిండి
    మామిడికాయ పకోడీ
    మొక్కజొన్న కబాబ్
    మీల్‌మేకర్ పకోడీ
    మొక్కజొన్న కట్లెట్
    జాక్‌ఫ్రూట్‌ మసాలా బాల్స్‌
    3314e5f8bf
    34955b7e6b
    4331cfd919
    మొక్కజొన్నకర్రీ 65
    F7c5f54312

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.