సేమియా - ఒక కప్పు,
శెనగపిండి - ఒక కప్పు,
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు,
అల్లం పేస్ట్ - అర స్పూన్,
కరివేపాకు రెబ్బలు - కొన్ని,
కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు,
బేకింగ్ పౌడర్ - చిటికెడు,
కారం - ఒక స్పూన్,
ఉప్పు - రుచికి సరిపడా,
నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే పద్ధతి :
- స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఒక స్పూన్ నూనె వేసి వేడెక్కాక ఒక కప్పు సేమియా వేసి దోరగా వేగించాలి.
- ఇంకో గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు నీళ్లు పోసి వేడిచేసి అందులో వేగించిన సేమియా వేసి మెత్తగా అయ్యే వరకు మూతపెట్టి ఉడికించాలి.
- ఉడికించిన సేమియా, శెనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తురుము, బేకింగ్ పౌడర్, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పకోడి పిండిలా కలపాలి.
- తరువాత కడాయిలో నూనె పోసి వేడిచేయాలి. కలిపి పెట్టుకున్న పిండిని పకోడీల్లా కొద్దికొద్దిగా కాగిన నూనెలో వేసి వేగించాలి. సేమియా బజ్జీలు సిద్ధం.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక