దొండకాయలు - పావుకేజి,
శెనగపిండి - ఒక కప్పు,
బేకింగ్ సోడా - అర టీస్పూన్,
కారం - ఒక టీస్పూన్,
ఉప్పు- రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి:
- శెనగపిండి, బేకింగ్‌సోడా, కారం, ఉప్పులను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి, ఒక స్పూన్ నూనె కూడా వేసి మెత్తటి పేస్ట్‌లా కలపాలి.
- దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా కోయాలి.
- కళాయిలో నూనె పోసి వేడి చేసి దొండకాయ ముక్కల్ని శెనగపిండి పేస్ట్‌లో ముంచి వేగించాలి. ఎంతో సింపుల్‌గా దొండకాయ బజ్జీలు రెడీ.
మూలం : ఆంద్రజ్యోతి దినపత్రిక