ఉప్మా రవ్వ - అరకప్పు,
మైదా - అర టేబుల్ స్పూన్
పుదీనా - 2 కట్టలు,
ధనియాలు - 1 టేబుల్ స్పూన్
చింతపండు - నిమ్మకాయంత,
అల్లం - 25 గ్రాములు,
నూనె - సరిపడా
ఉప్పు - తగినంత,
పచ్చిమిర్చి - 4,
జీలకర్ర పొడి - 1టీ స్పూన్
బ్లాక్ సాల్ట్ - ఒకటిన్నర టీ స్పూన్,
మొలకలు - అరకప్పు,
బూందీ - అరకప్పు
తయారీ విధానం
- బొంబాయిరవ్వలో మైదా, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలిపి పావుగంట నాననివ్వాలి.
- తర్వాత ఈ పిండిని బాగా చిన్న ఉండలు చేసుకుని పూరీల్లా వత్తి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు పూరీలు తయారైనట్టే.
- వీటిని గాలి చేరని డబ్బాలో వేసుకోవాలి.
- చింతపండులో నీళ్లుపోసి గంట నానబెట్టాలి.
- ధనియాలను పొడి చేసుకోవాలి.
- పుదీనా, పచ్చిమిర్చి, అల్లం నూరుకోవాలి.
- చింతపండు రసం తీసి దానికి మరికొన్ని నీళ్లు కలపాలి.
- అందులో పుదీనా పచ్చిమిర్చి అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, బ్లాక్‌సాల్ట్ కలపాలి.
- ఈ మిశ్రమాన్ని రెండు, మూడు గంటలు కదపకుండా ఉంచాలి.