శనగపిండి - 1 కప్పు
పసుపు - చిటికెడు
ఈనో సాల్టు- 1 టీ.స్పూ.
నీళ్లు - 1/2 కప్పు
పోపు :
నూనె - 1 టీ.స్పూ.
ఆవాలు - 1/4 టీ.స్పూ.
కరివేపాకు - 2 రెబ్బలు
నీళ్లు - 2 టీ.స్పూ.
పంచదార - 1 టీ.స్పూ.
నిమ్మరసం - 1 టీ.స్పూ.
పుదీనా ఆకులు,
కొత్తిమీర ఆకులు - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 2
తయారుచేసే పద్ధతి :
- పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- డోక్లా చేయాలనుకునే పళ్లెం లేదా కేక్ టిన్నుకు లోపలి వైపు నూనె రాసుకోవాలి.
- ఒక గి న్నెలో జల్లించిన శనగపిండి తీసుకుని పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి.
- ఈనో ఫ్రూట్ సాల్ట్, నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని నూనె రాసిన పళ్లెంలో ముప్పావు వంతు వరకు పోయాలి. కుక్కర్లో గ్లాసుడు నీళ్లుపోసి ఒక స్టాండ్ పెట్టి దానిమీద ఈ పళ్లెం పెట్టి మూత పెట్టాలి. కుక్కర్ మూత కూడా పెట్టి పైన విజిల్ పెట్టకుండా పదిహేను నిమిషాలు ఉడికించి దింపేయాలి. ఒక చిన్న గినె్నలో పంచదార, నీళ్లు, నిమ్మరసం వేసి కలిపి చల్లారిన డోక్లా మీద పోసి పది నిమిషాలు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత తిరగేసి మెల్లిగా తడితే ఉడికిన డోక్లా మొత్తం బయటికి వచ్చేస్తుంది.
- దాన్ని మనకు నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేరే పళ్లెంలో లేదా గినె్నలో పెట్టాలి. ఈ డోక్లాలను జాగ్రత్తగా అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసి మధ్యలో తయారుచేసుకున్న గ్రీన్ చట్నీ రాసి దానిపైన మిగతా ముక్క పెట్టాలి. ఇప్పుడది సాండ్విచ్లా ఉంటుంది.
- ఒక చిన్న గినె్న లేదా గరిటలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి చిటపటలాడాక తీసి డోక్లాలమీద వేయాలి. వీటిని వెంటనే సర్వ్ చేయొచ్చు లేదా కాస్త చల్లబరచి తిన్నా బావుంటాయి. ఇష్టముంటే పైన పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా చల్లుకోవచ్చు.