సేమ్యా - అరకప్పు
బంగాళాదుంపలు - 2
బఠానీలు - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - 3
నూనె - వేయించడానికి సరిపడా
అల్లం - చిన్న ముక్క
కొత్తిమీర తురుము - అరకప్పు
మైదా పిండి - అరకప్పు
బ్రెడ్ పొడి - కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- బఠానీలు నానబెట్టి ఉంచాలి.
- ముందుగా సేమ్యా ఉడికించి నీళ్ళు వంపేసి పక్కన ఉంచాలి.
- బంగాళదుంప, క్యారెట్ చెక్కు తీసి సన్నగా తరగాలి. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి కూడా సన్నగా తరగాలి.
- బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర తురుము వేసి వేయించాలి. తరువాత కూరగాయ ముక్కలు, నానబెట్టిన బఠానీలు వేసి మూతపెట్టి కాసేపు ఉడికించుకోవాలి. తరువాత ఉడికించి ఉంచిన సేమ్యా, ఉప్పు వేసి బాగా కలిపి ఐదు నిమషాలు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారాక చిన్న బిళ్ళల్లా చేయాలి.
- మైదా పిండిలో కొద్దిగా నీళ్ళు పోసి జారుగా కలుపుకోవాలి. ఇప్పుడు సేమ్యా మిశ్రమం బిళ్ళల్ని ఈ పిండిలో ముంచి బ్రెడ్ పొడిలో దొర్లించి నూనెలో వేయించి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం