బంగాళాదుంపలు - 4
పసుపు - చిటికెడు
కార్న్ ఫ్లోర్ - 3 టీ.స్పూ.
పచ్చిమిర్చి తరుగు - 1 టీ.స్పూ.
వెల్లుల్లి తరుగు - 1/2 టీ.స్పూ.
ఎండుమిర్చి - 3
ఉప్పు - తగినంత
అజినొమొటో - చిటికెడు
నూనె - వేయించడానికి
చేయండి ఇలా
- బంగాళా దుంపలలో పసుపు వేసి మెత్తగా ఉడికించాలి.
- చల్లారిన తర్వాత తొక్కలు తీసి పొడి పొడిగా చేయాలి.
- ఇందులో కార్న్ ఫ్లోర్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అజినొమొటో, వెల్లుల్లి తరుగు, బరకగా పొడి చేసుకున్న ఎండుమిర్చి, తగినంత ఉప్పువేసి బాగా కలపాలి. మొత్తం మసాలా కలిసిన తర్వాత పొడవుగా గొట్టంలా చేసుకుని అంగుళం సైజులో కట్ చేసుకోవాలి. లేదా చిన్న చిన్న ఉండలు గానూ చేసుకోవచ్చు. వీటిని నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించి టమాటా సాస్‌తో వేడిగా సర్వ్ చేయాలి.