కోడిగుడ్లు : 3,
ఓట్స్ : ఒకటిన్నర కప్పు,
ఉప్పు : రుచికి తగినంత,
మిరియాల పొడి : అర టీ స్పూన్,
కోడిగుడ్టు : 1 ఉడకబెట్టనిది,
నూనె : వేయించడానికి తగినంత,
చాట్‌మసాలా : టీ స్పూన్,
నిమ్మరసం : టీ స్పూన్.
తయారు చేయు విధానం
- ఒక పాత్రలో ఓట్స్, గుడ్డు సొన, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి.
- ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి.
- స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి.
- ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్ మిశ్రమం గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించాలి.
- ఆ గుడ్డును కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌చేసి ప్లేట్లో సర్ది తినాలి.