యాపిల్స్ : 2,
శెనగపిండి : పావుకిలో,
వరిపిండి : ఒక టేబుల్ స్సూను
కారం : ఒక టీ స్పూను,
ధనియాల పొడి : ఒక టీ స్పూను,
జీలకర్ర పొడి : అర టీ స్పూను,
ఉప్పు : తగినంత,
నూనె : సరిపడా.
తయారు చేయు విధానం
ఒక గిన్నెలో శెనగపిండి, వరిపిండి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నీళ్లు వేసి జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు యాపిల్‌ని శుభ్రంగా కడిగి గుండ్రంగా గాని, పొడవుగా గాని ముక్కలు కోసుకోవాలి. పొయ్యిమీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక యాపిల్ ముక్కల్ని పిండిలో ముంచి బజ్జీలుగా వేసుకోవాలి. వీటిని జామ్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.