మరమరాలు - కప్పు
సన్న కారప్పూస - కప్పు
దానిమ్మ గింజలు - కప్పు
యాపిల్ ముక్కలు - అరకప్పు
ద్రాక్ష - కప్పు
కమలా ఫలం తొనలు - కొన్ని
నిమ్మరసం - రెండు చెంచాలు
మిరియాల పొడి - రెండు చెంచాలు
మొలకెత్తిన పెసలు, చిన్న సెనగలు - రెండు కలిపి కప్పు
వాము పొడి - అరచెంచా
కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఉప్పు - తగినంత
తయారుచేసే పద్ధతి :
- ఓ గిన్నెలో మరమరాలు, సన్న కారప్పూస తీసుకొని బాగా కలిపి, మొలకెత్తిన పెసలు, చిన్న సెనగలు కూడా వేసేయాలి. ఇప్పుడు వాము పొడి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత పండ్ల ముక్కలు, కొత్తిమీర కూడా వేసి అంతా కలిసేలా నిమ్మరసం కూడా వేస్తే నోరూరించే భేల్ సిద్దం.
మూలం : ఈనాడు వసుంధర