మొక్కజొన్న గింజలు : 2 కప్పులు,
ఉల్లిచక్రాలు : 10,
కొబ్బరి కోరు : కప్పు,
పచ్చిమిర్చి : 5,
కార్న్ఫ్లోర్ : అరకప్పు,
నూనె : అరకప్పు,
కొత్తిమీర : అరకప్పు,
అల్లంవెల్లులి పేస్టు : టేబుల్ స్పూన్,
బ్రెడ్పొడి : 2 కప్పులు,
శనగపిండి : కప్పు.
తయారుచేసే పద్ధతి :
మొక్కజొన్న గింజలు, కొబ్బరి కోరు, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. అనంతరం ఇందులో శనగపిండి, కార్న్ఫ్లోర్, అల్లంవెల్లులి పేస్టు వేసి బాగా కలపాలి. మీకు నచ్చిన ఆకారంలో వీటిని తయారు చేసుకోని బ్రెడ్ పౌడర్లో అద్దుకుని పక్కకు పెట్టుకోండి. స్టవ్ వెలిగించి పెనం మీద కొద్దిగా నూనె వేసి కట్లెట్ను వేసి రెండు పక్కల ఎర్రగా కాల్చాలి. అనంతరం వీటిని ఉల్లిచక్రాలతో అలంకరించండి.. అంతే మొక్క జొన్న కట్లెట్ తయార్..