పన్నీర్ - 400 గ్రా.
నూనె - వేయించడానికి సరిపడా
కొత్తిమీర తురుము - టేబుల్ స్పూన్
కోడిగుడ్లు - ఒకటి
కార్న్ ఫ్లోర్ - అరకప్పు
ఉల్లి తురుము - 2 కప్పులు
సోయాసాస్ - టేబుల్ స్పూన్
వెనిగర్ - 2 టేబుల్ స్పూన్లు
అజినమెటో - పావుటీస్పూన్
నీళ్ళు - కొద్దిగా
ఉల్లికాడల తురుము - టేబుల్ స్పూన్
అల్లం, వెల్లుల్లి - టీస్పూన్
పచ్చిమిర్చి తురుము - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - 2 టీస్పూన్లు
తయారుచేసే పద్ధతి :
- పన్నీర్ ను చదరపు ముక్కల్లా కోయాలి. ఓ గిన్నెలో పన్నీర్ ముక్కలు, టీస్పూన్ ఉప్పు, కోడిగుడ్డు, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి, నీళ్ళు వేసి కలపాలి.
- బాణలిలో నూనె వేడి అయ్యాక పన్నీర్ ముక్కల్ని వేసి బంగారు వర్ణంలోకి వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
- మరో బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి అయ్యాక ఉల్లి తురుము వేసి వేగాక పచ్చిమిర్చి తురుము, సోయాసాస్, ఉప్పు, వెనిగర్, అజినమెటో వేసి కలపాలి.
- తరువాత వేయించి తీసిన పన్నీర్ ముక్కలు వేసి కలిపి దించాలి. చివరగా వీటి మీద ఉల్లికాడల తురుము, కొత్తిమీర తురుము చల్లి అందించాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం