ఉడికించిన గుడ్లు - నాలుగు,
గుడ్డు - ఒకటి,
బ్రెడ్ క్రంబ్స్ - వందగ్రాములు,
వెల్లుల్లి - నాలుగు,
పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరిగి),
ఉప్పు - ఒక టీస్పూన్,
నూనె- వేగించడానికి సరిపడా.
తయారీ:
ఒక గిన్నెలో కోడిగుడ్డు సొన కార్చి అందులోనే బ్రెడ్ క్రంబ్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి కలపాలి.
ఆ తరువాత ఈ మిశ్రమాన్ని నాలుగు సమభాగాలుగా చేయాలి.
చేతులకి నూనె పూసుకుని ఒక్కో భాగాన్ని గుండ్రంగా ఆలు పాటీల్లా చేయాలి. ఒక్కో పాటీ మధ్యలో ఉడికించిన గుడ్డుని ఉంచి గుడ్డు బయటకి కనిపించకుండా దాని చుట్టూరా ఆ మిశ్రమం సర్దాలి.
పైపూత ఎండిపోకుండా ఉండేందుకు వీటిని గిన్నెలో ఉంచి మూతపెట్టాలి. అన్ని గుడ్లకి పూత పూయడం అయ్యాక కళాయిలో నూనె వేడిచేసి గుడ్లను ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేగించాలి. ఎగ్ బాల్స్ రెడీ.