మామిడికాయ తురుము - అరకప్పు
బంగాళదుంపల తురుము - పావుకప్పు
ఉల్లి ముక్కలు - పావుకప్పు
సెనగ పిండి - అరకప్పు
అల్లం-పచ్చిమిర్చి ముద్ద - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తురుము - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - వేయించడానికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- ఓ గిన్నెలో అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తరువాత తగినన్ని నీళ్ళు పోసి పకోడీ పిండిలా కలపి ఓ పది నిముషాలు పక్కన ఉంచాలి.
- బాణలిలో నూనె వేసి బాగా వేడి అయ్యాక పిండిని పకోడీల్లా వేసి తీయాలి. వీటిని వేడిగా సాస్ తో తింటే చాల బాగుంటాయి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం