స్వీట్ కార్న్ గింజలు - కప్పు
బంగాళాదుంపలు - 2(మీడియం సైజ్)
పచ్చిమిర్చి - 2
అల్లం తురుము - అరటీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 5
నూనె - వేయించడానికి సరిపడా
గరం మసాలా - అరటీస్పూన్
నిమ్మరసం - 2 టీస్పూన్లు
కొత్తిమీర తురుము - అరకప్పు
ఉప్పు - రుచికి సరిపడా
తయారుచేసే పద్ధతి :
- ముప్పావు కప్పు మొక్కజొన్న గింజల్ని ఉడికించి కచ్చాపచ్చాగా రుబ్బాలి.
- తరువాత అందులో మెత్తగా దంచిన వెల్లుల్లి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి ముద్దలా చేయాలి.
- బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసి మెత్తగా మెదపాలి. తరువాత అందులో బ్రెడ్ పొడి, మొక్కజొన్న ముద్ద, మిగిలిన పావు కప్పు మొక్కజొన్న గింజలు, కొత్తిమీర తురుము, గరం మసాలా, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలపాలి.
- మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఒక్కో ముద్దన అరచేతుల్లోనే గుండ్రని బిళ్ళల్లా వత్తి పెనం మీద నూనె వేస్తూ రెండు వైపులా కాల్చి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం