మీల్‌మేకర్ - 200 గ్రాములు,
ఉల్లిపాయలు - 10(గా,
క్యారెట్ -10(గా,
బఠాణీలు - 10(గా,
అల్లం వెల్లుల్లి - 10(గా,
కొత్తిమీర - ఒక కట్ట,
పచ్చిమిరపకాయలు-10,
కార్న్‌ఫ్లోర్ పౌడర్ - 2 స్పూన్లు,
అజినోమోటో - ఒక స్పూను,
సోయా సాస్ - నాలుగు స్పూన్లు,
వెనిగర్ - నాలుగు స్పూన్లు,
నూనె - సరిపడా,
ఉప్పు -రుచికి సరిపడా,
మైదా - రెండు స్పూన్లు,
రెడ్ కలర్ - ఒక స్పూన్
తయారు చేసేవిధానం :
- ముందుగా మీల్‌మేకర్‌ను నీళ్లలో నానబెట్టుకుని పదినిమిషాలపాటు ఉడికించుకోవాలి.
- అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, క్యారెట్, బఠానీలను వేసి కొద్దిగా ఉడికించుకోవాలి.
- అందులో మైదా, కార్న్‌ఫ్లోర్ పౌడర్, సోయాసాస్, అజినోమోటో, ఉప్పు, కలర్ వేసుకోవాలి. వెనిగర్‌ను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఈ ఉండలను వేసి వేయించుకోవాలి.
- మరొక పాన్‌లో నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేగిన తరువాత వేయించుకున్న మంచూరియాను కలపాలి. కాసేపు ఫ్రై చేసుకుని కొత్తిమీర వేసి దింపుకోవా లి. మీల్ మేకర్ మంచూరియా రెడీ!