మొక్కజొన్న గింజలు-రెండు కప్పులు
కీమా-యాభై గ్రా.
మొక్కజొన్న పిండి-చెంచా
పుట్నాలపప్పు-చెంచా, ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చి-ఆరు, పసుపు-కొద్దిగా
కొత్తిమీర-కట్ట, గరంమసాలా-చెంచా
అల్లం, వెల్లుల్లి మిశ్రమం -చెంచా
ఉప్పు-తగినంత
నూనె-వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
మొక్కజొన్న గింజల్ని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు మొక్కజొన్న గింజలు, పుట్నాలపప్పు, సగం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, గరంమసాలా, అల్లంవెల్లుల్లి మిశ్రమం, తగినంత ఉప్పును తీసుకుని మిక్సీలో గట్టిగా రుబ్బుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేయించి కీమా చేర్చి పసుపు, మరికాస్త ఉప్పు వేసి వేయిం చాలి. ఐదు నిమిషాలయ్యాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని చేర్చి కలిపి దింపేయాలి. ఈ పిండి గట్టిగా ఉండాలి. దీని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని మొక్కజొన్నపిండిలో అద్ది కాగుతోన్న నూనెలో వేయించుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. వేడివేడి సాస్‌తో కలిపి తీసుకోవచ్చు.