బ్రెడ్‌ముక్కలు-పది,
పాలకూర-కట్ట
అల్లం,పచ్చిమిర్చిముద్ద-అరచెంచా,
వెల్లుల్లి ముద్ద-అరచెంచా
గరంమసాలా-అరచెంచా,
నిమ్మరసం-చెక్క
ఉప్పు-రుచికి తగినంత,
పనీర్-150 గ్రా.
మారినేషన్ కోసం
నిమ్మరసం-చెంచా,
అల్లం,పచ్చిమిర్చి ముద్ద-అరచెంచా
వెల్లుల్లిముద్ద-అరచెంచా,
మిరియాల పొడి-పావుచెంచా
మొక్కజొన్న పిండి-తగినంత,
నూనె-వేయించడానికి తగినంత
తయారుచేసే విధానం
- మొక్కజొన్న పిండి, నూనె కాకుండా మిగతా మారినేషన్ పదార్థాలు, పనీర్‌ను గిన్నెలోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి.
- తరువాత పాలకూరను శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పెట్టుకోవాలి.
- ఇప్పుడు బ్రెడ్‌ముక్కల చివర్లు తీసేసి అందులో అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి ముద్ద, గరంమసాలా, ఉప్పు, నిమ్మరసం అన్నీ కలిపి పెట్టుకోవాలి.
- అందులో పాలకూర తరుగు, మారినేట్ చేసిన పనీర్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేర్చుతూ బాగా కలపాలి.
- బాణలిలో నూనెపోసి పొయ్యిమీద పెట్టాలి. వేడయ్యాక మిశ్రమాన్ని ఉండల్లా చేసుకుని వేయించుకోవాలి.
- బాగా వేగాక దించేస్తే పనీర్ పాలకూర బాల్స్ సిద్ధమయినట్టే. వీటిని చల్లటి సాయంత్రం వేళ టమాటాసాస్‌తో కలిపి తింటే బాగుంటాయి.