బఠాణీలు - 200 గ్రాములు,
ఉల్లిగడ్డ -1
మైదా - 100 గ్రాములు,
చాట్ మసాలా - 5 గ్రాములు
జీలకర్ర పొడి - 5 గ్రాములు,
కారం - 5 గ్రాములు
సేవ్ - 5 గ్రాములు,
బంగాళదుంప - 1
నూనె - సరిపడా,
ఉప్పు - తగినంత
తయారీ విధానం
బఠాణీలలో కొద్దిగా ఉప్పువేసి ఉడికించాలి. మైదా పిండిలో ఉప్పు, నీళ్లు కలిపి పూరీ పిండిలా కలుపుకోవాలి. దాన్ని చిన్న చిన్న ఉండలు చేసుకుని పూరీల్లా వత్తుకోవాలి. వాటిని త్రికోణాకృతితో మడిచి వేయించుకోవాలి. బంగాళదుంపను ఉడికించి మెత్తగా చేయాలి. ఉల్లిపాయ ముక్కలను నూనెలో వేయిచి, అందులో ఉడకించిన బఠాణీలు, బంగాళదుంప ముద్ద, ఉప్పు, కారం, జీలకర్ర పొడి, వేయించుకున్న పూరీలను పొడి చేసి వేయాలి. ఈ మిశ్రమాన్ని అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చివర్లో చాట్ మసాలా, సేవ్ చల్లుకోవాలి.