బంగాళదుంపలు - 3
క్యారెట్, బీన్స్
క్యాలీఫ్లవర్ - 100 గ్రాములు
జీలకర్ర - 1 టీ స్పూన్,
మిరియాల పొడి - పావు టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్,
అల్లం - 50 గ్రాములు
చాట్ మసాలా - పావు టీ స్పూన్
కొత్తిమీర - 1 కట్ట,
పుదీనా - 1 కట్ట
ఉప్పు - సరిపడా,
కారం - తగినంత,
నూనె - తగినంత
తయారీ విధానం
- బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మెదపాలి.
- క్యారెట్, బీన్స్, క్యాలీఫ్లవర్లను ఉడికించి వడగట్టి బంగాళ దుంప ముద్దలో కలపాలి.
- అందులో జీలకర్ర, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం, కొత్తిమీర, పుదీనా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి కొద్దిగా అదమాలి.
- వీటిని పెనంమీద నూనెతో కాల్చుకుని పైన చాట్ మసాలా చల్లాలి.