సెనగ పప్పు - అరకప్పు (రెండు గంటలు నానబెట్టి రుబ్బాలి)
పన్నీర్ - అరకిలో
ఎండుమిర్చి - 5
చాట్ మసాలా - 2 టీస్పూన్లు
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - 6
టిక్కి కోసం :
బంగాళాదుంపలు - 4
కార్న్ ఫ్లోర్ - టీస్పూన్
నూనె - సరిపడా
తయారుచేసే పద్ధతి :
- బాణలిలో నూనె పోసి అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము వేసి ఓ నిమిషం వేయించాలి. తరువాత కచ్చాపచ్చాగా రుబ్బిన సెనగపప్పు, ఉప్పు, ఎండు మిర్చి ముక్కలు, చాట్ మసాలా వేసి వేయించాలి. పప్పు బాగా వేగిన తర్వాత పన్నీర్ తురుము వేసి బాగా కలపాలి.
- ఒక గిన్నెలో బంగాళాదుంపలు ఉడికించి కాస్త ఉప్పు వేసి మెత్తగా మెదపాలి. అవసరమైతే కొద్దిగా నీళ్ళు చిలకరించాలి. ఇప్పుడు బంగాళాదుంపల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని అరచేతిలోనే చిన్న సైజ్ టిక్కిలా చేసుకొని మద్యలో పన్నీర్ మిశ్రమాన్ని పెట్టి మళ్లీ మూసేసి టిక్కిలా చేసి కార్న్ ఫ్లోర్ లో దొర్లించి నూనెలో వేయించి తీయాలి.
మూలం : ఈనాడు ఆదివారం పుస్తకం