ఉడికించిన గుడ్లు - నాలుగు (పొట్టుతీసి),
సోయా, టొమాటో, చిల్లీ సాస్‌లు - ఒక్కో టేబుల్ స్పూన్,
బటర్ - రెండు టేబుల్ స్పూన్లు,
ఉల్లికాడలు - రెండు (సన్నగా తరిగి),
లవంగాలు - మూడు,
ఉప్పు - రుచికి సరిపడా.
తయారీ:
గిన్నె వేడిచేసి అందులో బటర్ కరిగించాలి. తరువాత సోయా, టొమాటో, చిల్లీ సాస్‌లతో పాటు లవంగాలు, గుడ్లు వేయాలి. గుడ్లను మధ్య మధ్యలో నెమ్మదిగా తిప్పుతూ ఐదునిమిషాలకు పైగా ఉంచాలి. గుడ్లు రంగు మారగానే బయటికి తీసి ఒక ప్లేట్‌లో పెట్టి పైన ఉల్లికాడల ముక్కలు చల్లి అలంకరించాలి. ఈ మంచూరియాని ఫ్రైడ్ రైస్ లేదా నూడిల్స్‌తో కలిపి తింటే మజాగా ఉంటుంది.