బ్రౌన్ బ్రెడ్ స్లైసులు - 6
కోడిగుడ్లు- 3
ఉల్లిపాయ -1
క్యారట్ తురుము - 4 టీ.స్పూ.
కొత్తిమీర తరుగు - 3 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
మిరియాల పొడి - 1/2 టీ.స్పూ.
వెన్న - 4 టీ.స్పూ.
నూనె - 2 టీ.స్పూ.
ఇలా చేయాలి
- పాన్‌లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయవేసి మెత్తబడేవరకు వేయించాలి.
- ఒక గినెనలో కోడిగుడ్లను కొట్టివేసి నురగ వచ్చేలా గిలక్కొట్టాలి. వేగిన ఉల్లిపాయలో ఈ గుడ్డు మిశ్రమం వేసి వెంటనే కలపాలి.
- మొత్తం పొడి పొడిగా అయ్యాక క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిసేపు వేపి చల్లారనివ్వాలి.
- బ్రౌన్ బ్రెడ్ స్లైసులకు ఒక వైపు వెన్న రాసి గుడ్డు మిశ్రమం పెట్టి మరో వెన్న రాసిన స్లైసు పెట్టి అదమాలి.
- దీనికి రెండు వైపులా కొద్దిగా వెన్న రాసి సాండ్‌విచ్ టోస్టర్ లేదా పెనం మీద రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చుకుని వెంటనే సర్వ్ చేయాలి.