telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

గ్రీన్ పీస్ పూరీ

10/31/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు :

గోధుమపిండి - ఒక కప్పు,

మైదా - ఒక కప్పు,
బఠాణీలు - అర కప్పు,

అల్లం పేస్ట్ - పావు టీ స్పూన్,
పచ్చిమిరపకాయలు - 2,
గరం మసాలా పౌడర్ - పావు టీ స్పూన్,
జీలకర్ర - పావు టీ స్పూన్,

నూనె, ఉప్పు - తగినంత

తయారు చేసే విధానం :
బఠాణీల్లో కొన్ని నీళ్ళు పోసి ఉడికించాలి. నీళ్ళని వడకట్టి దాంట్లో అల్లం పేస్ట్, పచ్చిమిరపకాయలు, గరం మసాలా పౌడర్, జీలకర్ర వేసి మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో గోధుమపిండి, మైదా, ఉప్పు, కొద్దిగా నూనె, నీళ్ళు పోసి ఉండలు కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమాన్ని పూరీల కోసం చిన్న ముద్దలుగా చేయాలి. ఒక్కో దాన్ని తీసుకొని గుండ్రంగా వత్తాలి. దీంట్లో బఠాణీ మిశ్రమాన్ని వేసి మడిచి మళ్లీ పూరీల్లా చేసుకోవాలి. ఇలా అన్ని చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. వేరే కూరలేకుండా ఈ పూరీలనే లాగించేయొచ్చు.

0 Comments
 

పానీపూరీ మసాలా మురుకులు

10/30/2013

0 Comments

 
Picture
కావలసినవి
బియ్యం పిండి - 3  కప్పులు
పుట్నాల పప్పు పొడి -  1 కప్పు
వాము - 1 టీ.స్పూ.
ఉప్పు - తగినంత
పానీపురి మసాలా  పొడి:
పుదీనా, కొత్తిమీర -  1/2 కప్పు
పచ్చిమిర్చి - 3
ఆంచూర్ పొడి - 1  టీస్పూ.
జీలకర్ర పొడి - 1/2  టీ.స్పూ.
చాట్ మసాలా పొడి -  1/2 టీ.స్పూ.
నల్ల ఉప్పు - 1/4  టీ.స్పూ.
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి

ఇలా చేయాలి
  • పానీపురి మసాలా కోసం  సన్నగా తరిగిన  పుదీనా, కొత్తిమీర,  పచ్చి మిర్చి, నల్ల  ఉప్పు, జీలకర్ర పొడి,  చాట్ మసాలా పొడి,  ఆంచూర్ పొడి కలిపి  మెత్తగా గ్రైండ్  చేసుకోవాలి.
  • ఒక గినెనలో బియ్యం పిండి,  పుట్నాల పప్పు పొడి,  ఉప్పు, వాము వేసి  కలపాలి.
  • ఇందులో  పానీపురి మసాలా  ముద్ద వేసి కలపాలి.
  • మరో గినె్నలో రెండు  కప్పుల నీళ్లు మరిగించి  రెండు చెంచాల నూనె  వేయాలి. ఈ నీళ్లను  పిండిలో వేసి కలిపి  మూత పెట్టి ఉంచాలి.
  • చల్లారిన తర్వాత బాగా  పిసికి పెట్టుకోవాలి.
  • మురుకుల గిద్దెలో  కొంచెం కొంచెం పిండి  ముద్ద పెట్టుకుని వేడి  నూనెలో  మురుకులు/జంతికల్లా  వత్తుకుని నిదానంగా  కాల్చుకోవాలి.

0 Comments
 

ఎగ్ బజ్జీ

10/27/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు
కోడిగుడ్లు : 3,

ఓట్స్‌ : ఒకటిన్నర కప్పు,
ఉప్పు : రుచికి తగినంత,
మిరియాల పొడి : అర టీ స్పూన్‌,
కోడిగుడ్టు : 1 ఉడకబెట్టనిది,
నూనె : వేయించడానికి తగినంత,
చాట్‌మసాలా : టీ స్పూన్‌,
నిమ్మరసం : టీ స్పూన్‌.

తయారు చేయు విధానం
  • ఒక పాత్రలో ఓట్స్‌, గుడ్డు సొన, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, చాట్‌మసాలా వేసి బాగా కలపాలి.
  • ఉడికించిన గుడ్డును అందులో వేసి మిశ్రమమంతా బాగా పట్టేలా తిప్పాలి.
  • స్టౌపై బాణలి పెట్టి నూనె కాగనివ్వాలి.
  • ఆ గుడ్డును నూనెలో వేసి ఓట్స్‌ మిశ్రమం గోధుమ రంగులోకి మారేంత వరకు వేయించాలి.
  • ఆ గుడ్డును కత్తితో మీకు ఇష్టం వచ్చిన ఆకారంలో ముక్కలుగా కట్‌చేసి ప్లేట్‌లో సర్ది తినాలి.

0 Comments
 

ఎగ్ బుర్జీ సాండ్‌విచ్

10/25/2013

0 Comments

 
Picture
కావలసినవి
బ్రౌన్ బ్రెడ్ స్లైసులు - 6
కోడిగుడ్లు- 3
ఉల్లిపాయ -1
క్యారట్ తురుము - 4  టీ.స్పూ.
కొత్తిమీర తరుగు - 3  టీ.స్పూ.
ఉప్పు - తగినంత
మిరియాల పొడి -  1/2 టీ.స్పూ.
వెన్న - 4 టీ.స్పూ.
నూనె - 2 టీ.స్పూ.

ఇలా చేయాలి
  • పాన్‌లో నూనె వేడి చేసి  సన్నగా తరిగిన  ఉల్లిపాయవేసి  మెత్తబడేవరకు  వేయించాలి.
  • ఒక గినెనలో కోడిగుడ్లను  కొట్టివేసి నురగ వచ్చేలా  గిలక్కొట్టాలి. వేగిన  ఉల్లిపాయలో ఈ గుడ్డు  మిశ్రమం వేసి వెంటనే  కలపాలి.
  • మొత్తం పొడి  పొడిగా అయ్యాక క్యారట్  తురుము, కొత్తిమీర  తరుగు, ఉప్పు,  మిరియాల పొడి వేసి  కొద్దిసేపు వేపి  చల్లారనివ్వాలి.
  • బ్రౌన్  బ్రెడ్ స్లైసులకు ఒక వైపు  వెన్న రాసి గుడ్డు  మిశ్రమం పెట్టి మరో  వెన్న రాసిన స్లైసు పెట్టి  అదమాలి.
  • దీనికి రెండు  వైపులా కొద్దిగా వెన్న  రాసి సాండ్‌విచ్ టోస్టర్  లేదా పెనం మీద రెండు  వైపులా బంగారు రంగు  వచ్చేవరకు కాల్చుకుని  వెంటనే సర్వ్ చేయాలి.

0 Comments
 

బెండకాయ బజ్జీ

10/22/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు
బెండకాయలు : ఆరు,

శెనగపిండి : ఒక కప్పు,
మొక్కజొన్న పిండి : ఒక కప్పు,
వంట సోడా : చిటికెడు,
ధనియాల పొడి : ఒక టీ స్పూను,
జీలకర్ర పొడి : ఒక టీ స్పూను,
కారం : రెండు టీ స్పూన్లు,
ఉప్పు : తగినంత,
నూనె : సరిపడా.

తయారు చేయు విధానం
ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి నీరు లేకుండా బట్టతో తుడిచి ఒక గంట సేపు ఆరబెట్టాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి రెండు టేబుల్‌ స్పూన్ల నూనె పోసి అందులో బెండకాయల్ని వేగించాలి. కాయ బాగా మెత్తబడ్డాక తీసేసి వాటిపై ధనియాల పొడి ఉప్పు, కారం చల్లాలి. ఇప్పుడు మరో గిన్నెలో శెనగపండి, మొక్కజొన్న పిండి, జీలకర్ర పొడి, కారం, ఉప్పు, సోడా, నీళ్లు వేసి బజ్జీ పిండి కలుపుకోవాలి. కడాయిలో సరిపడా నూనె పోసి బాగా కాగాక బెండకాయల్ని పిండిలో ముంచి వేయాలి.

0 Comments
 

చాక్లెట్ ఫ్రైడ్ డిమ్సమ్...

10/21/2013

0 Comments

 
Picture
చాక్లెట్ ఫ్రైడ్ డిమ్‌సమ్ తయారు చేయడానికి కావలసినవి:
మైదా - 1 కప్పు
డాల్డా - 2 టీస్పూన్
ఉప్పు - చిటికెడు
చాకోస్ - 1/4 కప్పు
చాక్లెట్ బార్ - 1
బాదాం - 5
జీడిపప్పు - 6
పిస్తా - 5
నూనె - వేయించడానికి

ఒక గిన్నెలో చాకోస్, సన్నగా కట్ చేసుకున్న బాదాం, జీడిపప్పు, పిస్తా ముక్కలు తీసుకుని చాక్లెట్ తురిమి వేయాలి. ఇదంతా కలిపి ఉంచుకోవాలి. మైదాలో కరిగించిన డాల్డా, చిటికెడు ఉప్పు వేసి కలిపి అవసరమైనన్ని నీళ్లు చల్లుకుంటూ చపాతీపిండిలా తడిపి మూతపెట్టి ఉంచాలి. అరగంట తర్వాత తీసి కాస్త నూనె రాసుకుని బాగా పిసికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసుకోవాలి. ఒక్కో ఉండను పొడి పిండి చల్లుకుంటూ పల్చగా, చిన్న పూరీలా వత్తుకోవాలి. మధ్యలో చెంచాడు చాక్లెట్, నట్స్ మిశ్రమం పెట్టి నాలుగు వైపులనుండి మూసేయాలి. అంచులు విడిపోకుండా గట్టిగా వత్తిపెట్టాలి. వీటిని వేడి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని తీయాలి. వీటిని ఆవిరి మీద కూడా ఉడికించుకోవచ్చు. పిల్లలు అలాంటివి ఇష్టపడకుంటే డీప్ ఫ్రై చేసుకోవాలి.

0 Comments
 

కీమా టిక్కీ

10/19/2013

0 Comments

 
Picture
కావలసినవి
మొక్కజొన్న గింజలు-రెండు కప్పులు
కీమా-యాభై గ్రా.
మొక్కజొన్న పిండి-చెంచా
పుట్నాలపప్పు-చెంచా, ఉల్లిపాయ-ఒకటి
పచ్చిమిర్చి-ఆరు, పసుపు-కొద్దిగా
కొత్తిమీర-కట్ట, గరంమసాలా-చెంచా
అల్లం, వెల్లుల్లి మిశ్రమం -చెంచా
ఉప్పు-తగినంత
నూనె-వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
మొక్కజొన్న గింజల్ని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు మొక్కజొన్న గింజలు, పుట్నాలపప్పు, సగం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, గరంమసాలా, అల్లంవెల్లుల్లి మిశ్రమం, తగినంత ఉప్పును తీసుకుని మిక్సీలో గట్టిగా రుబ్బుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి మిగిలిన ఉల్లిపాయ ముక్కలు వేయించి కీమా చేర్చి పసుపు, మరికాస్త ఉప్పు వేసి వేయిం చాలి. ఐదు నిమిషాలయ్యాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని చేర్చి కలిపి దింపేయాలి. ఈ పిండి గట్టిగా ఉండాలి. దీని చిన్నచిన్న ఉండల్లా చేసుకుని మొక్కజొన్నపిండిలో అద్ది కాగుతోన్న నూనెలో వేయించుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చాక తీసేస్తే సరిపోతుంది. వేడివేడి సాస్‌తో కలిపి తీసుకోవచ్చు. 

0 Comments
 

పొటాటో బైట్స్

10/18/2013

0 Comments

 
Picture
కావలసినవి
బంగాళాదుంపలు - 4
పసుపు - చిటికెడు
కార్న్ ఫ్లోర్ - 3 టీ.స్పూ.
పచ్చిమిర్చి తరుగు - 1  టీ.స్పూ.
వెల్లుల్లి తరుగు - 1/2  టీ.స్పూ.
ఎండుమిర్చి - 3
ఉప్పు - తగినంత
అజినొమొటో - చిటికెడు
నూనె - వేయించడానికి

చేయండి ఇలా
  • బంగాళా దుంపలలో పసుపు  వేసి మెత్తగా ఉడికించాలి.
  • చల్లారిన తర్వాత తొక్కలు  తీసి పొడి పొడిగా చేయాలి.
  • ఇందులో కార్న్ ఫ్లోర్,  సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అజినొమొటో, వెల్లుల్లి  తరుగు, బరకగా పొడి  చేసుకున్న ఎండుమిర్చి,  తగినంత ఉప్పువేసి బాగా  కలపాలి. మొత్తం మసాలా  కలిసిన తర్వాత పొడవుగా  గొట్టంలా చేసుకుని అంగుళం  సైజులో కట్ చేసుకోవాలి.  లేదా చిన్న చిన్న ఉండలు  గానూ చేసుకోవచ్చు. వీటిని  నూనెలో బంగారు రంగు  వచ్చేవరకు వేయించి  టమాటా సాస్‌తో వేడిగా సర్వ్  చేయాలి.


0 Comments
 

యాపిల్ బజ్జీ

10/9/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు
యాపిల్స్‌ : 2,

శెనగపిండి : పావుకిలో,
వరిపిండి : ఒక టేబుల్‌ స్సూను
 కారం : ఒక టీ స్పూను,
ధనియాల పొడి : ఒక టీ స్పూను,
జీలకర్ర పొడి : అర టీ స్పూను,
ఉప్పు : తగినంత,
నూనె : సరిపడా.

తయారు చేయు విధానం
ఒక గిన్నెలో శెనగపిండి, వరిపిండి, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, నీళ్లు వేసి జారుగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు యాపిల్‌ని శుభ్రంగా కడిగి గుండ్రంగా గాని, పొడవుగా గాని ముక్కలు కోసుకోవాలి. పొయ్యిమీద కడాయి పెట్టి సరిపడా నూనె పోసి బాగా కాగాక యాపిల్‌ ముక్కల్ని పిండిలో ముంచి బజ్జీలుగా వేసుకోవాలి. వీటిని జామ్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.


0 Comments
 

జాలీ మిర్చి

10/8/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు
బజ్జీ మిరపకాయలు : 8 నుంచి 10, పనీర్‌ తురుము : 1/2 కప్పు, క్యారట్‌ తురుము : 4 స్పూన్లు, బీన్స్‌ తురుము : 5 స్పూన్లు, ఉప్పు : తగినంత, మైదా : 100 గ్రాములు, డాల్డా : 2 స్పూన్లు, మిరియాల పొడి : 1/4 స్పూన్లు, అజినొమొటొ : చిటికెడు, కొత్తిమీర : కొద్దిగా, నిమ్మరసం : స్పూన్‌, నూనె : వేయించడానికి.

తయారు చేయు విధానం
మైదాలో కరిగించిన డాల్డా , చిటికెడు ఉప్పు వేసి కలిపి నీళ్లతో చపాతీ పిండిలా తడిపి మూతపెట్టి ఉంచుకోవాలి. బజ్జీ మిరపకాయలను నిలువుగా గాటు పెట్టి లోపలి గింజలు తీసేయాలి. మరుగుతున్న నీళ్లలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీసేయాలి. వీటిని పూర్తిగా ఆరనివ్వాలి. ఒక ప్యాన్‌లో చెంచాడు నూనె వేడి చేసి సన్నగా తరిగిన క్యారట్‌ , బీన్స్‌ తురుము వేసి పచ్చి వాసన పోయేవరకు వేపాలి. ఇందులో పనీర్‌ తురుము, ఉప్పు, అజినొమొటొ, మిరియాలపొడి వేసి మరి కొద్దిసేపు వేయించి కొద్దిగా కొత్తిమిర కలిపి దింపేయాలి. పూర్తిగా చల్లారాక నిమ్మరసం కలపాలి. పచ్చిమిర్చీలలో ఈ మిశ్రమాన్ని నింపి గట్టిగా వత్తి పెట్టుకొవాలి. మైదా పిండిని మర్ధనా చేసి మృదువుగా అయ్యాక చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ ఉండను పలుచటి చపాతీలా వత్తుకుని చాకుతో సన్నటి పట్టీలలా కట్‌ చేసుకోవాలి. ఈ పట్టీని పనీర్‌ మిశ్రమమ పెట్టిన మిర్చీకి రెండు వైపులా అందంగా చుట్టి ఊడిపోకుండా మిర్చీకేసి మెల్లిగా వత్తాలి. అన్నీ తయారయ్యాక వేడి నూనే వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించుకుని స్వీట్‌ చట్నీ, గ్రీన్‌ చట్నీ, ఉల్లిపాయ, టమాటాలతో లేదా టమాటా సాస్‌తో సర్వ్‌ చేయాలి. ఈ మిర్చీలను కట్‌ చేసి పెరుగు వగైరా వేసి చాట్‌ లా కూడా సర్వ్‌ చేయొచ్చు..



0 Comments
 
<< Previous

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. 

    Categories

    All
    రగ్ డా పట్టి
    ఎగ్ కట్ లెట్స్
    ఎగ్ చాట్
    ఎగ్ బజ్జీ
    ఆలూ టిక్కా
    ఎగ్ బాల్స్
    ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్
    ఎగ్ బుర్జీ సాండ్‌విచ్
    ఆలూ పన్నీర్ చాట్
    ఎగ్ మంచూరియా
    బేల్ పూరి
    పానీ పూరి
    లెహ్ సుని టిక్కి
    ఫిష్ పకోడి
    రైస్ పకోడి
    దాల్ కచోరి
    గోబీ పకోడీ
    చాకో బనానా సాండ్ విచ్
    మీల్ మేకర్ మంచూరియా
    రాగి పిండి బిస్కెట్స్‌
    కీమా టిక్కీ
    జాలీ మిర్చి
    గోబీ మంచురియా
    కబాబ్
    సమోసా రగడ
    బఠానీ చాట్
    మూంగ్ దాల్
    సాండ్ విచ్ డోక్లా
    పాలక్ పకోడి
    టమోటా బజ్జీ
    ఓట్స్ శాండ్ విచ్
    మొలకల ఫ్రూట్ భేల్
    పనీర్ పాలకూర బాల్స్
    బ్రెడ్ పాన్ కేక్
    గ్రీన్ పీస్ పూరీ
    గ్రీన్ పీస్ ధోక్లా
    బ్రెడ్ బజ్జీ
    పాలకూర పకోడీ
    యాపిల్ బజ్జీ
    బ్రెడ్ సమోసా
    సేమియా పకోడీ
    సొరకాయ పకోడి
    దోసకాయ బజ్జీ
    టొమాటో బోండా
    గుత్తి వంకాయ బజ్జీ
    అటుకుల టిక్కి
    పొటాటో బైట్స్
    తందూరీ టిక్కా
    స్వీట్ కార్న్
    బ్రెడ్ పిజ్జా
    కార్న్ టిక్కి
    సేమ్యా టిక్కి
    బ్రెడ్ స్వీట్ కార్న్ బాల్స్
    చిల్లీ పన్నీర్
    బ్రెడ్ పన్నీర్ రోల్
    బ్రెడ్ మంచురియా
    సకినాలు
    చెక్కలు
    కట్లెట్
    పన్నీర్ బజ్జీ
    పన్నీర్ పకోడీ
    దొండకాయ బజ్జీ
    పన్నీర్ పకోడి
    హరియాలి టిక్కి
    పన్నీర్ బాల్స్
    స్టఫ్డ్ మిర్చి బజ్జీ
    నర్గీసీ కబాబ్స్
    పన్నీర్ సిగార్స్
    ప్రాన్స్
    నూడుల్స్ ప్రై
    క్యాబేజీ బోండా
    పానీపూరీ మసాలా మురుకులు
    చాక్లెట్ ఫ్రైడ్ డిమ్సమ్...
    అమెరికన్ చాప్‌సూయి
    సర్వపిండి
    మామిడికాయ పకోడీ
    మొక్కజొన్న కబాబ్
    మీల్‌మేకర్ పకోడీ
    మొక్కజొన్న కట్లెట్
    జాక్‌ఫ్రూట్‌ మసాలా బాల్స్‌
    3314e5f8bf
    34955b7e6b
    4331cfd919
    మొక్కజొన్నకర్రీ 65
    F7c5f54312

    Archives

    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    RSS Feed

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.