బ్రెడ్ స్లైసెస్ - ఏడు
బూందీ - అరకప్పు
ఉడికించిన ఆలూ - మూడు (మెదపాలి )
దానిమ్మ గింజలు - పావుకప్పు
చాట్ మసాలా - అరచెంచ
ఉప్పు - తగినంత
సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
నూనె - వేయించడానికి సరిపడా
నిమ్మరసం - రెండు చెంచాలు
తయారుచేసే పద్ధతి :
- బ్రెడ్ స్లైసుల అంచుల్ని తీసేసి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడి చేసి ఈ బ్రెడ్ ముక్కల్ని వేసి ఎర్రగా వేయించుకోవాలి.
- ఓ గిన్నెలో నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నింటిని తీసుకొని బాగా కలపాలి. తినే ముందు నిమ్మరసం కలిపితే సరిపోతుంది. చాలా సులువుగా చేసుకొనే ఈ ఇన్ స్టంట్ బ్రెడ్ మిక్సర్ ఎంతో రుచిగా ఉంటుంది.
మూలం : ఈనాడు వసుంధర