పన్నీర్ తురుము : 1 కప్పు
బ్రెడ్ స్లైసెస్ : 4
ఉల్లిపాయ ముక్కలు : పావుకప్పు
కారం : 1 చెంచా
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 చెంచా
టమాటో ప్యూరీ : 1 చెంచా
కొత్తిమీర తురుము : 1 చెంచా
ఉప్పు, నూనె : తగినంత
తయారుచేసే పద్ధతి :
బ్రెడ్ స్లైసెస్ చివర్లు కట్ చేసి, చపాతీ కర్రతో ఒత్తాలి. పన్నీర్ తురుములో నూనె తప్ప మిగిలినవన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ స్లిసేస్ లో పెట్టి, రోల్స్ లాగా చుట్టి, తడి చేతితో చివర్లు మూసేయాలి. వీటిని నూనెలో గోధుమ వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి.
మూలం : సాక్షి దినపత్రిక