వెర్మిసెల్లీ : 200 గ్రా.
ఉడికించిన ఆలు : 200 గ్రా.
బియ్యప్పిండి : అరకప్పు
క్యారెట్ తురుము : పావుకప్పు
ఉల్లి తరుగు : పావుకప్పు
కారం : చెంచాడు
గరం మసాలా : చెంచాడు
కొత్తిమీర : తగినంత
ఉప్పు : తగినంత
నూనె : తగినంత
తయారుచేసే పద్ధతి :
వెర్మిసెల్లీని ఐదు నిముషాలు ఉడికించి తీసి ఆరబెట్టుకోవాలి. బంగాళాదుంపలను మెత్తగా చిదిమి, అందులో వెర్మిసెల్లీతో పాటు మిగిలినవన్నీ వేసి బాగా కలపాలి(నూనె తప్ప). ఈ మిశ్రమాన్ని కట్ లెట్స్ గా ఒత్తుకొని నూనెలో డీప్ ఫ్రై చేయాలి. టొమాటో సాస్ తో తింటే రుచి అదిరిపోతుంది.
మూలం : సాక్షి ఆదివారం పుస్తకం