చేపలు - 2
కోడిగుడ్లు - 2
కార్న్‌ఫ్లోర్ - 2 స్పూన్స్
కారం - ఒక టీ స్పూన్
నిమ్మరసం - 2 స్పూన్స్
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు, నూనె - తగినంత
తయారు చేసే విధానం :
- చేపలను బాగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- కొత్తిమీరను సన్నగా తరుక్కోవాలి.
- ఒక గిన్నెలో కోడిగుడ్లను బాగా గిలకొట్టి అందులో ఉప్పు, కారం, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలపాలి. ఆ తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసి మరికాసేపు కలుపుకోవాలి.
- ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడయ్యాక ఒక్కో ముక్కను కార్న్‌ఫ్లోర్ మిశ్రమంలో ముంచి వేయాలి. బంగారు వర్ణం వచ్చే వరకు వేయించి తీయాలి. ఏదైనా చట్నీతో లాగిస్తే మరింత ఉంటాయి ఫిష్ పకోడీలు!