పాలకూర - మూడు కప్పులు (సన్నగా కట్ చేసుకోవాలి)
శెనగ పిండి - ఒకటిన్నర కప్పు
బియ్యప్పిండి - రెండున్నర కప్పులు
కారం పొడి - ఒక టీస్పూన్
జీలకర్ర పొడి - అరటీస్పూన్
అల్లం - అరటీస్పూన్
పుదీనా - రెండు టేబుల్ స్పూన్లు (సన్నగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర - రెండు టేబుల్ స్పూన్లు
నూనె - వేయించుకోవడానికి సరిపడా
ఉప్పు - తగినంత
వేడి చేసిన నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే పద్ధతి :
ఒక గిన్నెలో పాలకూర ఆకుల ముక్కలు, శెనగ పిండి, బియ్యప్పిండి, కారం, జీలకర్ర పొడి, అల్లం పేస్ట్, పుదీనా, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి వేడి చేసిన నూనె, కొద్దిగా నీళ్ళు పోసి కలుపుకోవాలి.
తర్వాత స్టవ్ మీద బాణలి పెట్టి తగినంత నూనె పోసి కాగిన తర్వాత పకోడీకి తయారుచేసుకున్న పిండిని కొద్దికొద్దిగా వేయించాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అంతే పాలకూర పకోడీ రెడీ. గాలి పోకుండా డబ్బాలో దాచి ఉంచుకుంటే వారం రోజులు పాడవకుండా ఉంటాయి.
మూలం : సాక్షి దినపత్రిక